ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

*ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం* *పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం – జిల్లా కలెక్టర్, ఎస్పీ* .. *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దేశ రక్షణ కోసం, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు జిల్లా కలెక్టర్ చంద్ర శేఖర్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్‌తో పాటు,అమరవీరుల కుటుంబ సభ్యులు,అధికారులు ఘనంగా నివాళులర్పించారు....