ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
*ఘనంగా గాంధీ జయంతి వేడుకలు* రామచంద్రపురం, అక్టోబర్ 2 (ప్రజావాణి): మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రామచంద్రపురం డివిజన్‌లోని బాలవిహార్ పార్క్‌లో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వాసవి జాగృతి ప్రతినిధులు మాట్లాడుతూ.. గాంధీజీ పాటించిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు....