prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 6:12 pm Digital Edition : PRAJA VANI

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

*ఘనంగా గాంధీ జయంతి వేడుకలు*

రామచంద్రపురం, అక్టోబర్‌ 2 (ప్రజావాణి): మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని వాసవి జాగృతి ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో రామచంద్రపురం డివిజన్‌లోని బాలవిహార్‌ పార్క్‌లో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా వాసవి జాగృతి ప్రతినిధులు మాట్లాడుతూ.. గాంధీజీ పాటించిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వనిత అన్నపూర్ణ క్లబ్‌ ప్రెసిడెంట్‌ అన్నపూర్ణ, స్టేట్‌ కోఆర్డినేటర్‌ పృధ్వీ గుప్తా, వాయిస్‌ గవర్నర్‌ నాగమల్లేష్‌, సభ్యులు జ్ఞానేశ్వరి, శ్రీదత్త హ్యూమన్‌ రైట్స్‌ డిస్ట్రిక్ట్‌ ప్రెసిడెంట్‌ సీహెచ్‌. అరుణ తదితరులు పాల్గొన్నారు.