ఘనంగా కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు

*మన ప్రజావాణి* మందమర్రి/మందమర్రి రూరల్:-* దివంగత కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) 97వ జయంతి వేడుకలు సోమవారం పట్టణంలో, మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ కార్యాలయాలు తోపాటు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో అధికారులు కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరిస్తూ, ఆయన సేవలను కొనియాడారు. *మండల తహశీల్దార్ కార్యాలయంలో....* మండల కేంద్రంలోని మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం దళిత, బడుగు బలహీన...