prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 9:15 am Digital Edition : PRAJA VANI

ఘనంగా కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు

*మన ప్రజావాణి* మందమర్రి/మందమర్రి రూరల్:-*

దివంగత కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) 97వ జయంతి వేడుకలు సోమవారం పట్టణంలో, మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ కార్యాలయాలు తోపాటు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో అధికారులు కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరిస్తూ, ఆయన సేవలను కొనియాడారు.

*మండల తహశీల్దార్ కార్యాలయంలో….*

మండల కేంద్రంలోని మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం దళిత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మండల అదనపు తహసిల్దార్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో, పేద ప్రజల సంక్షేమం కోసం కాకా వెంకటస్వామి చేసిన కృషి మరువలేనిదన్నారు. జీవితాంతం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయాలను, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయబ్ తహశీల్దార్ సంతోష్ కుమార్, ఆర్ఐ లు, జీపీఓ లు, వీఆర్వో లు, వీఆర్ఏ లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

*పట్టణ మున్సిపల్ కార్యాలయంలో…*

పట్టణ మున్సిపాలిటీ కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమ నాయకులు గడ్డం వెంకటస్వామి (కాకా) 97వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కాకా చిత్రపటానికి పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కమీషనర్ తుంగపిండి రాజలింగు మాట్లాడుతూ, కార్మిక, పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాకా చేసిన కృషి మరువలేనిదన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల హక్కుల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, అంబేద్కర్ పేరుతో విద్యాసంస్థలు స్థాపించి విద్యావకాశాలు కల్పించారని, తెలంగాణ ఉద్యమంలో, సింగరేణి కార్మికులకు పింఛను సాధించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

*మండల ఎంపిడిఓ కార్యాలయంలో….*

మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో సోమవారం దళిత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మండల ఎంపిడిఓ ఎన్ రాజేశ్వర్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో, పేద ప్రజల సంక్షేమం కోసం కాకా వెంకటస్వామి చేసిన కృషి మరువలేనిదన్నారు. జీవితాంతం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయాలను, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

*పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో*

పట్టణంలో దివంగత మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) 97వ జయంతి వేడుకలు సోమవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని సింగరేణి గ్రీన్ ఎదుట ఏర్పాటు చేయనున్న కాకా వెంకటస్వామి విగ్రహానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిసిసి అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సిఈఆర్ క్లబ్ లో కాకా జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి పెట్టి, ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డిసిసి అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి లు మాట్లాడుతూ, రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఏడుసార్లు ఎంపీగా, నాలుగు పర్యాయాలు కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టి, నిరుపేదల, కార్మిక పక్షపాతిగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కాకా వెంకటస్వామి కే దక్కుకుందన్నారు. ముఖ్యంగా బొగ్గు గని కార్మికులకు పెన్షన్ పథకం ప్రవేశపెట్టి గని కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. కాకా వెంకటస్వామి పేద ప్రజల మనిషి అని, పేద ప్రజల కోసం హైదరాబాద్ ప్రాంతంలో ఇల్లు లేని వారికి దాదాపు 70 వేల గుడిసెలు వేయించి, గుడిసెల వెంకటస్వామి గా పేరు గడించారని తెలిపారు. సింగరేణి సంస్థ నష్టాల్లో కూరుకుపోయి మూసివేసే దశలో ఉన్నప్పుడు సింగరేణిని కాపాడిన గొప్ప నాయకుడు కాకా అని గుర్తు చేశారు. కాకా కృషితోనే నేడు పట్టణ ప్రజలకు గోదావరి నీళ్లు అందుతున్నాయని తెలిపారు. అదేవిధంగా జైపూర్ పవర్ ప్లాంట్, రామగుండం పెర్టిలైజర్ ఫ్యాక్టరీ తదితర అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంత అభివృద్ది కొరకు కాకా వెంకటస్వామి చేసి, స్థానిక ప్రజలకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ప్రతి ఒక్కరు కాకా వెంకట స్వామి ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోత్కు సుదర్శన్, కాంపెల్లి సమ్మయ్య, పుల్లూరి లక్ష్మణ్, గుడ్ల రమేష్, నోముల ఉపేందర్ గౌడ్, పైడిమల్ల నర్సింగ్,రాయబారపు కిరణ్,
హఫీజ్,రాజన్న,మంకు రమేష్,సుకూర్,నెరవేట్ల శ్రీనివాస్,జి రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

*మండలంలోని సారంగపల్లి గ్రామంలో…*

మండలంలోని సారంగపల్లి గ్రామంలో సోమవారం దివంగత నేత గడ్డం వెంకటస్వామి (కాకా) 97వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడారి జీవన్ కుమార్ ఆధ్వర్యంలో కాకా చిత్రపటానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జీవన్ కుమార్ మాట్లాడుతూ, కార్మికుల చెమట చుక్కలోనే దేశ ప్రగతి దాగి ఉందనే స్ఫూర్తితో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కాకా అనేక సంస్కరణలు చేపట్టారన్నారు. రాజకీయం అంటే పదవులు అనుభవించడం కాదు, అణగారిన వర్గాలకు అండగా నిలబడడమని చాటిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మాసు సంతోష్ కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వేల్పుల శంకర్, మండల కార్యదర్శి నర్సింగోజు తిరుపతి, ప్రధాన కార్యదర్శి ఆకుల అంజి, స్పోక్స్ పర్సన్ ఎగుడా రాజమల్లు, సారంగపల్లి గ్రామ సర్పంచ్ బచ్చలి రాములు, శంకర్ పల్లి గ్రామ పెరమండ్ల వెంకటేష్,చిర్రకుంట గ్రామ సర్పంచ్ రాంటెంకి తిరుపతి – లతా, వెంకటాపుర్ సెగ్గం వెంకటేష్, మాజీ సర్పంచులు కమల మనోహర్ రావు, అసంపల్లి రాజయ్య, కాంగ్రెస్ నాయకులు కొట్టే సంపత్, వేల్పుల చిరంజీవి, కాపురపు సతీష్, గోసికే వినయ్, నీలం రవి లు పాల్గొన్నారు..