ఘనంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ జన్మదిన వేడుకలు..
ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఎదళ్ల యాదవ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లికుదురులోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మురళీ నాయక్ బర్త్ డే కేకును యాదవ రెడ్డి ప్రభృతులు కట్ చేశారు. స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్భంగా యాదవ రెడ్డి మాట్లాడుతూ ప్రజా నేత,మృదుస్వభావి, మానుకోట అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే డా.మురళి నాయక్ మానుకోట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని,మరిన్ని గొప్ప పదవులు అధిరోహిస్తూ ప్రజాసేవలో కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.