గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జమ్మి మొక్క నాటిన ఎమ్మెల్యే మల్లారెడ్డి
ఊరికో జమ్మి చెట్టు.. గుడికో జమ్మి చెట్టు
మేడ్చల్: మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ‘ఊరికో జమ్మి చెట్టు.. గుడికో జమ్మి చెట్టు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మల్లారెడ్డి మెడికల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో కళాశాల విద్యార్థులతో కలిసి జమ్మి మొక్కను నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ, గత నాలుగేళ్లుగా తమ క్యాంపస్‌లో మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు పెద్ద పండుగగా జరుపుకునే విజయదశమికి ముందు పవిత్రంగా భావించే జమ్మి చెట్టును నాటడం ఆనందంగా ఉందని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేలా జమ్మి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి నూతికాడి భోజనారాయణ, మెట్టు శ్రీకాంతరెడ్డి, ఉమామహేష్, డాక్టర్ భార్గవ్, టి. రంగారావు, ఆమెందే కుమార్ తదితరులు పాల్గొన్నారు.