గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు జి పి ఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు
మద్దూరు ఎంపిడిఓ సి. హెచ్.శ్రీనివాస్
మద్దూరు అక్టోబర్12, ప్రజా వాణి,
మద్దూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల ట్రాక్టర్లకు జి పి ఎస్ ట్రాకింగ్ సిస్టం అమర్చినట్లు ఎంపిడిఓ శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటి నుండి నాలుగు రకాల చెత్తను సేకరించడం కోసం గ్రామపంచాయతీ ట్రాక్టర్లు పని చేయడం జరుగుతుందన్నారు. గ్రామంలోని ప్రతివాడకు గ్రామపంచాయతీ ట్రాక్టర్ తిరిగే విధంగా పర్యవేక్షణ చేయుట కొరకే ఈ జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సిహెచ్ శ్రీనివాస్,ఎంపీఓ జి. వెంకటేశ్వర్లు,టెక్నీషియన్ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శులు అశోక్, భాస్కర్,మధు రజియా,కిరణ్, గ్రామపంచాయతీ సిబ్బంది శేఖర్,గణేష్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.