prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 6:09 am Digital Edition : PRAJA VANI

గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగిన మోహనశ్రీ కి ఘన సన్మానం

*గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగిన మోహనశ్రీ కి ఘన సన్మానం*

*గాజుల గట్టు కురుమ సంఘం ఆధ్వర్యంలో*

గూడూరు మండల ప్రతినిధి:- అక్టోబర్ 21. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం పరిధిలోని గాజులగట్టు మారుమూల పల్లెల్లో నిరుపేద కుటుంబం లో జన్మించిన గంధసిరి శ్రీనివాస్ మౌనిక దంపతుల పెద్ద కూతురు మోహనశ్రీ, గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయి క్రికెట్ క్రీడల్లో కాకతీయ యూనివర్సిటీ నుండి జట్టు లో స్థానంతో పాటు, జట్టు సారధ్య బాధ్యతలు చేపట్టే స్థాయి వరకు ఎదిగిన తీరు ప్రశంసనీయం. గతంలో పలుమార్లు జిల్లా స్థాయి క్రికెట్ క్రీడోత్సవాల్లో పాల్గొని, జట్టు విజయానికి కీలకపాత్ర పోషించిన, యువతి గంధసిరి మొహనశ్రీ భవిష్యత్తులో ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని, గాజుల గట్టు గ్రామానికి, గూడూరు మండలం లోని గ్రామాలన్నింటి లో ఉన్నతమైన స్థానాన్ని కల్పించే విధంగా కృషి చేయాలని, దానికి తోడు ఆ భగవంతుని ఆశీర్వచనాలు దక్కాలని కోరుకుంటూ… గాజులగట్టు కురుమ సంఘం నాయకులు, గౌడ జాతికి చెందిన గౌడ సింగం యువతి మోహనశ్రీ ని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గౌడ కుల బిడ్డను, గౌడ సంఘం గుర్తించకపోవడం గమనహర్వం?. గౌడ కులం ప్రత్యేకమైన గుర్తింపును ఇవ్వడం విస్మరించినా?, కురుమ సంఘం వారు గుర్తించి, మా గాజులగట్టు గ్రామాని కి క్రీడారంగంలో యువతి గంధసిరి మోహన శ్రీ ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు లభించాలనే దృడసంకల్పంతో ప్రోత్సహిస్తూ… శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు చీర అశోక్ కురుమ, కోరే గౌరయ్య, కోరే దేవేందర్, దయ్యాల అనిల్, సౌట చేరాలు, చీర కుమారస్వామి, కుండే కిరణ్, ఆరె మల్లయ్య, సౌటా కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.