గ్రామాల్లో జిల్లా అధికారి పెన్షన్స్ వెరిఫికేషన్..
ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని వివిధ గ్రామాలలో డిఆర్డిఏ జిల్లా అధికారి మల్లీశ్వరి చేయూత పెన్షన్స్ క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేశారు. ఎంపీడీవో బండారు పార్థసారధితో కలిసి ఆమె మంగళవారం మండలంలోని చిన్ననాగారం, అయ్యగారి పల్లి,కోమటిపల్లి గ్రామాలలో దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి అభ్యర్థులతో వివరాలు సేకరించారు. ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
*సెక్రటరీలు ఎఫ్ఏ లతో రివ్యూ..*
ఇనుగుర్తి ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు,విబీజీ రాంజీ ఫీల్డ్ అసిస్టెంట్లతో డిఆర్డిఏ జిల్లా అధికారి మల్లీశ్వరి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా చేయూత పెన్షన్లు, గ్రామాలలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనులు, విబీజి రాంజీ పథకంలో చేపట్టిన పనులపై, జాబ్ కార్డుల కేటాయింపు తదితర విషయాలపై పంచాయితీ కార్యదర్శులు ఎఫ్ఏ లతో ఆరా తీశారు.
సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన విధానాలపై మార్గ నిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో పార్థసారథి, ఏపీవో దీప్లా పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.