prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 3:16 pm Digital Edition : PRAJA VANI

గ్రామాభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలి

గ్రామాభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలి

ఎమ్మెల్యే కవ్వంపల్లి కి వినతిపత్రం అందజేసిన -సర్పంచ్ బిగుల్లా మోహన్

బెజ్జంకి, అక్టోబర్ 6 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ బిగుల్లా మోహన్ సంబంధిత అధికారులకు,ఎమ్మెల్యే కవ్వంపల్లిసత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని పురాతన నల్లబావి శిథిలావస్థకు చేరిందని, దానికి మరమ్మతులు చేపట్టి పునరుద్ధరించాలని కోరారు. అలాగే కల్లేపల్లి అంగన్‌వాడీ భవనం మరమ్మతులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
కల్లేపల్లి నుంచి బెజ్జంకి మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే బీటీ రోడ్డు మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు.గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేస్తే పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని సర్పంచ్ మోహన్ తెలిపారు.