గ్రంథాలయంలో అభ్యర్థుల కొరకు సదుపాయాల కల్పన
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య
*మన ప్రజావాణి*
*మంచిర్యాల జిల్లా*:-
విద్యార్థులు, పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థుల కొరకు గ్రంథాలయంలో సదుపాయాలు కల్పించడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించి, విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో మాట్లాడి, గ్రంథాలయంలో వారికి కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి, అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాలయంలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను గుర్తించి, మెరుగైన వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రంథాలయంలోని మరుగుదొడ్లకు నీటి సౌకర్యం కల్పించాలని, విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, గుర్తించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. నూతనంగా కొనుగోలు చేసిన పోటీ పరీక్షల పుస్తకాలను పరిశీలించి, వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలు, అధ్యయన సామగ్రి అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.
లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా చదవాలని, నిరంతరం సాధన చేస్తూ పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని, కష్టపడి చదివి, మంచి ఫలితాలు సాధించి, తమ లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారుఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు..