గ్యామతండాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై ఇన్‌చార్జీలతో సమావేశం
ప్రజా వాణి రిపోర్టర్ నర్సింహులపేట: రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించేందుకు గ్యామతండాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఓటర్ల నమోదు ఇన్‌చార్జీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి పట్టభద్రుడిని గుర్తించి, ఓటరు నమోదుకు అవసరమైన వివరాలను తెలియజేస్తూ, నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని నాయకులు సూచించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల వారీగా సమన్వయంతో పనిచేస్తూ, ఒక్క అర్హుడైన పట్టభద్రుడు కూడా ఓటు నమోదు చేసుకోకుండా మిగిలిపోకుండా చూడాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటు ప్రజాస్వామ్యంలో కీలకమని, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయానికి ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు తోట సురేష్, నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చిర్ర సతీష్ గౌడ్, నర్సింహులపేట సర్పంచ్ పెద్దమ్మామలి యాకయ్య, లోక్యతండా సర్పంచ్ రాజేంద్ర నాయక్, గ్యామతండా అధ్యక్షుడు నవీన్ నాయక్, కాంటెస్ట్ సర్పంచ్ అభ్యర్థి రామ్‌కోటి అనుషా, నాయకులు వీరన్న, వీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు.