గౌతమ్ పబ్లిక్ స్కూల్లో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం: జ్ఞాపకాల పందిరిలో మురిసిన గురుశిష్యులు
విజయవాడ అక్టోబర్19 ప్రజావాణి బడి జ్ఞాపకాలు ఎప్పటికీ మధురం. దశాబ్దాల కాలం గడిచినా, జీవితంలో ఎంతటి ఉన్నత స్థానాలకు చేరుకున్నా.. చిన్ననాటి మిత్రులను, చదువు చెప్పిన గురువులను కలుసుకున్నప్పుడు కలిగే ఆనందం అమూల్యం. సరిగ్గా అటువంటి ఒక అపురూపమైన, భావోద్వేగభరితమైన సన్నివేశానికి స్థానిక గౌతమ్ పబ్లిక్ స్కూల్ వేదికైంది. పాఠశాల పూర్వ విద్యార్థుల (అలుమ్ని మీట్) ఆత్మీయ కలయిక కార్యక్రమం ఆదివారం నాడు అట్టహాసంగా నిర్వహించబడింది.కార్యక్రమం ప్రవేశ ద్వారం వద్ద సాంప్రదాయబద్ధంగా రిబ్బన్ కటింగ్ చేయడంతో ప్రారంభమైంది. దశాబ్దాల తర్వాత తమ పాఠశాల ప్రాంగణంలో...