prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 9:31 am Digital Edition : PRAJA VANI

గోవిందరావుపేట గడ్డ.. అక్షరాల అడ్డా

గోవిందరావుపేట గడ్డ.. అక్షరాల అడ్డా

ప్రెస్ క్లబ్ పీఠాన్ని మళ్లీ కైవసం చేసుకున్న కలం యోధుడు

రిపోర్టర్‌ వెంకట్ గౌడ్

గోవిందరావుపేట (ప్రజావాణి)

అక్షరం అంటే అమ్ముడుపోనిది.. కలం అంటే వంగనిది అని మరోసారి రుజువైంది!
లక్నవరం-గోవిందరావుపేట ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ప్రత్యర్థులకు చోటే లేకుండా.. ఏకగ్రీవంగా.. దమ్ముగా.. దర్జాగా గద్దెనెక్కాడు బత్తిని వెంకట్ గౌడ్
అవును.. సాక్షి కలం నుంచి వచ్చిన సింహ గర్జన.. రెండోసారి ప్రెస్ క్లబ్ అధ్యక్ష పీఠాన్ని షేక్ చేసింది.
ఆదివారం రైతు వేదికలో జరిగింది ఎన్నిక కాదు.. అక్షరాల జాతర జర్నలిస్టుల ఐక్యతకు నిదర్శనం.
అధ్యక్షుడిగా బత్తిని వెంకట్ గౌడ్.. ఉపాధ్యక్షుడిగా ఆంధ్రప్రభ పగడాల వాసు రెడ్డి.. ఏకగ్రీవం అంటే.. తిరుగు లేని తీర్పు.
కుర్చీ కోసం కాదు.. కలం విలువ కోసం.. జర్నలిస్టుల హక్కుల కోసం ఈ పోరాటమని వేదికపైనే ప్రకటించారు వెంకట్ గౌడ్.
డబ్బుకు లొంగని జర్నలిజం.. బెదిరింపులకు జడవని నిజాయితీ.. ఇదే తన ఆయుధమన్నారు.
ప్రెస్ క్లబ్ ను భవనానికే పరిమితం కాకుండా.. ప్రజల గుండె చప్పుడుగా మారుస్తామని శపథం చేశారు.
ఇకపై గోవిందరావుపేటలో అన్యాయం జరిగితే.. కలం కాదు.. కత్తి దూస్తుంది.
అధికారంలో ఎవరున్నా.. అక్షరం ముందు తల వంచాల్సిందేనని తేల్చి చెప్పారు.
జర్నలిస్టుల సంక్షేమమే తమ అజెండా.. ఐక్యతే తమ బలం అని ఉపాధ్యక్షులు వాసు రెడ్డి స్పష్టం చేశారు.
మొత్తానికి.. గోవిందరావుపేట ప్రెస్ క్లబ్ కు మళ్లీ పులి వచ్చింది.. పేరు.. బత్తిని వెంకట్ గౌడ్.