గోల్డెన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఘట్కేసర్, అక్టోబర్ 16 (ప్రజావాణి): ఘట్కేసర్ సర్కిల్ పరిధిలో గోల్డెన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. బతుకమ్మ వేడుకలతో పరిసర ప్రాంతాల్లో పండుగ శోభ సంతరించుకుంది.