prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 1:22 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

గోల్డెన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఘట్‌కేసర్, అక్టోబర్ 16 (ప్రజావాణి):  ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలో గోల్డెన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు.

ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. బతుకమ్మ వేడుకలతో పరిసర ప్రాంతాల్లో పండుగ శోభ సంతరించుకుంది.