గోదావరిలో ఇసుక మాఫియా స్వైరవిహారం
*గోదావరిలో ఇసుక మాఫియా స్వైరవిహారం* ----వీడీసీల పేరుతో లక్షల రూపాయల దోపిడీ *రాయికల్, అక్టోబర్ 29 (ప్రజావాణి):* రాయికల్ మండలంలోని గోదావరి తీరం దోపిడీకి గురవుతోంది. జగన్నాథ్ పూర్, బోర్నపల్లి, ఇటిక్యాల, కొత్తపేట, మూటపల్లి, రామారావు పల్లె గ్రామాల పరిధిలో రాత్రికి రాత్రే వందల ట్రాక్టర్ల, టిప్పర్లు,లారీల ద్వారా ఇసుక మాయమైపోతోంది.గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిన గ్రామ అభివృద్ధి సంఘాల (వీడీసీల) పేరుతోనే దందా సాగుతోందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గ్రామాల్లో వీడీసీల పెత్తనంతో ఇసుకను అక్రమంగా టెండర్లు వేసి అందిన కాడికి దండుకుంటున్నారు. గుత్తేదారులు నిబంధనలను...