గోకినేపల్లిలో వైభవంగా శివ గణేష్ కనకదుర్గమ్మ శోభాయాత్ర
ముదిగొండ మండలం గోకినేపల్లి గ్రామంలో భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఊరేగింపు
ముదిగొండ అక్టోబర్ 21 ప్రజావాణి
మండల పరిధిలోని గోకినేపల్లి గ్రామంలో శివ గణేష్ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని పూలమాలలు, వివిధ రకాల అలంకరణలతో అందంగా ముస్తాబు చేసి శోభాయాత్ర నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తిగా తరలివచ్చారు.
శోభాయాత్రలో అమ్మవారి నామస్మరణలు, భక్తుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కనకదుర్గమ్మను ప్రార్థించారు. భక్తి వాతావరణంలో శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో చావ శ్రీకాంత్. పాశం శ్రీను. కుసుమ వెంకటేష్. సూరపల్లి ఏసు. మనోజ్. బాలకృష్ణ. వెంకటనారాయణ ( పెదరాయుడు) వెంకటేష్. భూక్య సైదులు. రామకోటి.జాను. నరేష్.మహిళలు అందరు పాల్గొన్నారు