గెస్ట్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర్ (ప్రత్యేక ఉపాధ్యాయుల) నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం.
హుజూర్నగర్ అక్టోబర్ 10 (ప్రజావాణి)
సమగ్ర శిక్షా తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్ సంచాలకుల ఉత్తర్వుల ప్రకారం, పీఎంశ్రీ పథకం కింద గెస్ట్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర్ (ప్రత్యేక అవసరాలు గల పిల్లల ఉపాధ్యాయులు) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు మఠంపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శంకర్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు (సి డబ్ల్యూ ఎస్ ఎన్) విద్యా సహాయం మరియు శిక్షణ అందించడానికి ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
అర్హత: అభ్యర్థులు తప్పనిసరిగా స్పెషల్ బీఈడీ అర్హత కలిగి ఉండాలి.
గౌరవ వేతనం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 16,500/- గౌరవ వేతనం చెల్లించబడుతుంది.
పని కాల పరిమితి: ఈ నియామకం పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన నవంబర్ 2026 నుండి మార్చి 2027 వరకు (5 నెలల కాలానికి) మాత్రమే ఉంటుంది.
ఎంపిక విధానం: అభ్యర్థుల మెరిట్ ప్రాతిపదికన, అందుబాటులో ఉన్న స్థానిక భాషలు మరియు విద్యార్హతల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. గ్రామం, మండలం, మరియు జిల్లా స్థాయిలో ఉన్న స్థానిక అభ్యర్థులకు మరియు అనుభవం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
బాధ్యతలు: ఎంపికైన అభ్యర్థులు మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, మరియు సమగ్ర శిక్షా సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేక విద్యా సహాయం, మూల్యాంకనం, అవగాహన కార్యక్రమాలు, మరియు తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం వంటి సేవలు అందించాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేయు విధానం:
అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత పాఠశాలలో అక్టోబర్ 10, 2026 లోపు సమర్పించవలసి ఉంటుంది. దరఖాస్తు ఫారాలు, నిబంధనలు మరియు ఇతర పూర్తి వివరాల కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులను లేదా ప్రిన్సిపాల్‌ను సంప్రదించవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ:10-10-2026
ప్రిన్సిపాల్
తెలంగాణ మోడల్ స్కూల్, మఠంపల్లి.