గూడూరులో సైనిక సూపర్ మార్ట్ ను ప్రారంభిచిన ఝాన్సీ రెడ్డి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 08(ప్రజావాణి): జిల్లా లోని పాలకుర్తి మండలం, గూడూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సైనిక సూపర్ మార్ట్ ను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గురువారం uఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులు ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. నేటి పోటీ ప్రపంచంలో గ్రామీణ యువత వ్యాపార రంగంలోకి రావడం, సొంతంగా ఎదగాలనే తపనతో ముందుకు రావడం హర్షణీయమని కొనియాడారు.

పట్టణాలకు వెళ్లకుండానే గ్రామంలోనే అన్ని రకాల కిరాణా సరుకులు, జనరల్ ఐటమ్స్, గృహోపకరణాలు, పిల్లలకు సంబంధించిన వస్తువులు సరసమైన ధరలకు లభించడం వల్ల గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
సైనిక సూపర్ మార్ట్ నిర్వాహకులు వ్యాపారంలో నిజాయితీగా, నాణ్యత విషయంలో రాజీ పడకుండా ముందుకు సాగి, ప్రజల నమ్మకాన్ని చూరగొనాలని సూచించారు. ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందాలని, గూడూరు గ్రామంలో మరిన్ని వ్యాపార సంస్థలు రావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.