prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 2:20 pm Digital Edition : PRAJA VANI

గూడూరులో ఘనంగా N షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం

*గూడూరులో ఘనంగా N షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం*

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 12(ప్రజావాణి): జిల్లా లోని
పాలకుర్తి మండలం, గూడూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన N షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ హన్మాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి షాపింగ్ మాల్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. షాపింగ్ మాల్ యాజమాన్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి నూతన వ్యాపార సంస్థలు ఏర్పాటు కావడం వల్ల స్థానిక ప్రజలకు నాణ్యమైన వస్త్రాలు, అవసరమైన వస్తువులు సులభంగా, తక్కువ ధరలో అందుబాటులోకి వస్తాయని, అదేవిధంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, వ్యాపార అభివృద్ధికి దోహదపడుతుందని ఆకాంక్షించారు. ప్రజలు నూతన షాపింగ్ మాల్ ను ఆదరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, షాపింగ్ మాల్ యజమానులు, స్థానిక వ్యాపారస్తులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.