prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 8:31 pm Digital Edition : PRAJA VANI

గూడూరులో ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థుల ఆధ్వర్యంలో PRA కార్యక్రమం

గూడూరులో ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థుల ఆధ్వర్యంలో PRA కార్యక్రమం

గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే కీలకం,: డిన్ డా, భూపాల్ రాజ్

ప్రజావాణి అక్టోబర్ 1 అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాం(RAWEP) లో భాగంగా ఎస్ ఆర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థులు గూడూరు గ్రామంలో పార్టిసిపెంటరి రూరల్ అప్రిజల్ PRA కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామ ప్రజల భాగస్వామ్యంతో గ్రామంలోని వ్యవసాయ పరిస్థితులు సహజ వనరులు రైతుల సమస్యలు గ్రామాభివృద్ధికి అవసరమైన అంశాలను గుర్తించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు

ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామ ప్రజలు రైతుల తో కలిసి పిఆర్ఏ మ్యాపింగ్ వనరుల గుర్తింపు గ్రామ సమస్యల విశ్లేషణ వంటి అంశాలపై చర్చించారు గ్రామస్తుల అనుభవాలు అభిప్రాయాలను సేకరించి వాటి గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగం చేయాల్సిన అవసరాన్ని వివరించారు

ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ భూపాల్ రాజ్ పాల్గొని విద్యార్థులను అభినందించారు గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో ప్రత్యక్షంగా పనిచేయడం ద్వారా ప్రజలకు వ్యవసాయ రంగంలోని వాస్తవ పరిస్థితులపై అవగాహన పెరుగుతుందని తెలిపారు రైతుల సమస్యలను అర్థం చేసుకొని శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వారికి చేరవేయడంలో వ్యవసాయ విద్యార్థులు వారధిగా నిలవాలని సూచించారు

గూడూరు సర్పంచ్ వనజ కళాధర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు గ్రామంలోని సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు విద్యార్థులు నిర్వహించిన పి ఆర్ ఏ కార్యక్రమం ఉపయోగకరంగా ఉందని తెలిపారు

RAWEP లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు గ్రామీణ సామాజిక పరిస్థితులు వ్యవసాయ సమస్యలు రైతుల అవసరాలు మరియు భాగస్వామ్యం గ్రామీణ అభివృద్ధి విధానాలపై Christmas అనుభవం లభించింది కార్యక్రమంలో ఎస్ ఆర్ యూనివర్సిటీ అధ్యాపకులు విద్యార్థులు గ్రామ ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు