గులగట్టు అమృతమ్మ మృతికి మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ నివాళి

నరసింహులపేట - ప్రజావాణి అక్టోబర్ 5: నరసింహులపేట మండలం పెద్దనాగారం గ్రామానికి చెందిన గులగట్టు అమృతమ్మ సోమవారం మృతి చెందారు. ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అమృతమ్మ గారి భౌతికకాయాన్ని సందర్శించిన డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ డీఎస్ రెడ్యానాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అమృతమ్మ మృతి కుటుంబ సభ్యులకు, బంధువులకు తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో...