prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 3:52 pm Digital Edition : PRAJA VANI

గులగట్టు అమృతమ్మ మృతికి మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ నివాళి

నరసింహులపేట – ప్రజావాణి అక్టోబర్ 5: నరసింహులపేట మండలం పెద్దనాగారం గ్రామానికి చెందిన గులగట్టు అమృతమ్మ సోమవారం మృతి చెందారు. ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అమృతమ్మ గారి భౌతికకాయాన్ని సందర్శించిన డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ డీఎస్ రెడ్యానాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అమృతమ్మ మృతి కుటుంబ సభ్యులకు, బంధువులకు తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గుజి వీరస్వామి, కొమ్ము మధు, గంట రాములు, చలమల్ల ఉపేందర్, టేకుల రవి, సెలమల భాస్కర్, గుజి వెంకన్న, గంట మహేష్, కర్నే శ్రీకాంత్, గాడుదుల కొమురెల్లి, అల్లిపురపు రవీందర్ రెడ్డి, కొమ్ము ఉపేందర్, సప్పిడి జయపాల్ రెడ్డి, జంపాల ఉపేందర్, గుజి వెంకన్న తదితరులు పాల్గొని అమృతమ్మ గారి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అమృతమ్మ గ్రామంలో అందరితో ఆప్యాయంగా మెలిగేవారని, ఆమె మృతి గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, ఈ విషాద సమయంలో వారి వెంట ఉంటామని తెలిపారు