గురువాయిగూడెంలో మెగా శ్రమదానం, పోషణ మాసం కార్యక్రమాలు
గురువాయిగూడెంలో మెగా శ్రమదానం, పోషణ మాసం కార్యక్రమాలు కూసుమంచి, ప్రజావాణి ప్రతినిధి అక్టోబర్ 1 కూసుమంచి మండలం గురువాయిగూడెం గ్రామంలో గురువారం మెగా శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘ఏక్ దిన్, ఏక్ గంట’ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది కలిసి గ్రామంలో శ్రమదానం చేసి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోతు బిక్షం నాయక్, పంచాయతీ కార్యదర్శి కుశ, వార్డు సభ్యులు భాను, సతీష్ నాయక్, పాలకుర్తి దుర్గారావు, బానోత్ పద్మ, పుట్టపర్తి రమాదేవి, ఆశా...