గురువాయిగూడెంలో మెగా శ్రమదానం, పోషణ మాసం కార్యక్రమాలు
కూసుమంచి, ప్రజావాణి ప్రతినిధి అక్టోబర్ 1
కూసుమంచి మండలం గురువాయిగూడెం గ్రామంలో గురువారం మెగా శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘ఏక్ దిన్, ఏక్ గంట’ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది కలిసి గ్రామంలో శ్రమదానం చేసి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోతు బిక్షం నాయక్, పంచాయతీ కార్యదర్శి కుశ, వార్డు సభ్యులు భాను, సతీష్ నాయక్, పాలకుర్తి దుర్గారావు, బానోత్ పద్మ, పుట్టపర్తి రమాదేవి, ఆశా కార్యకర్తలు, గ్రామ దీపికలు, అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా గురువాయిగూడెం అంగన్వాడీ కేంద్రంలో ‘పౌష్టికాహారం తీసుకోండి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ బానోతు బిక్షం నాయక్ పోషణ మాసం కార్యక్రమాలను ప్రారంభించారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారం, దాని పోషక విలువలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సువర్చల, అంగన్వాడీ టీచర్లు సారాబుట్ల వెంకటలక్ష్మి, బానోతు సునీత, పంచాయతీ కార్యదర్శి కుశ, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.