prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 9:19 pm Digital Edition : PRAJA VANI

గునిపర్తి గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్

గునిపర్తి గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్

ప్రజావాణి అక్టోబర్ 30 కమలాపూర్ మండలం గునిపర్తి గ్రామంలో భూమి రి సర్వే కార్యక్రమంలో భాగంగా హనుమకొండ కలెక్టర్ గునిపర్తి గ్రామాన్ని సందర్శించడం జరిగింది
భూమి రీ సర్వే యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ని తెలుసుకోవడం జరిగింది . తొందరలో ఈ యొక్క సర్వేను పూర్తి దశలో కంప్లీట్ చేయాలని వారికి ఉత్తర్వులు జారీ చేసింది అలాగే గ్రామంలో సందర్శించి మధ్య లో ఆపివేసిన పనులు గ్రామపంచాయతీ యొక్క బిల్డింగ్ మరియు మహిళా సంఘం వివో బిల్లింగ్ ను సందర్శించి పూర్తి దశలో నిర్మాణం కంప్లీట్ చేయాలని పై అధికారులకు ఆదేశాలను జారీ చేయడం జరిగింది
ఆత్మకూరు మరియు గూనిపర్తి గ్రామం మధ్యలో ఉన్నటువంటి చెక్ డాంని సందర్శించి అక్కడ మైనింగ్ పనుల గురించి రెండు గ్రామాల ప్రజలు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం తదుపరి పై అధికారులతో మాట్లాడుతానని మాట ఇచ్చారు ఆ యొక్క గుట్టను తొలగించడం వలన సమస్యలను రెండు గ్రామాల ప్రజల ద్వారా తెలుసుకున్నారు నీరుని నిల్వ చేయడానికి వీలుగా ఉండదు ఆ వాగును నమ్ముకుని ఉన్నటువంటి ఆరు గ్రామాల్లో సుమారుగా 6000 ఎకరాలకు పంటలను సాగు చేసుకోవడం జరుగుతుంది అలాగే గుట్టపైన కాకతీయుల కాలంనాటి పురాతన శివాలయమును కూడా గుర్తించడం జరిగింది. దీనివల్ల అక్కడ గుట్టపైన మైనింగ్ పనులను జరిపితే దీనివల్ల వీటన్నిటికీ ఇబ్బంది జరుగుతుందని తెలుసుకున్నారు పరకాల నుండి ఎర్రగట్టుగుట్ట వరకు డబుల్ రోడ్డు సాంక్షన్ లో భాగంగా గూనిపర్తి గ్రామంలో రోడ్డుకు ఇరుపక్కల ఉన్నటువంటి మిషన్ భగీరథ తాగునీరు పైపులైన్లు పూర్తిగా దెబ్బతినడం జరుగుతుంది. దీనివల్ల గ్రామ ప్రజలకు తాగునీరులు అందించకపోవడంలో సమస్య తలెత్తుతుందని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో కమలాపూర్ ఎమ్మార్వో ఎండిఓ ఎస్సై గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు