prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 8:22 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

గుడుంబా స్థావరాల పై పోలీస్ మెరుపు దాడిఎస్సై రవికుమార్

దంతాలపల్లి
అక్టోబర్ 1 (ప్రజావాణి)

స్థానిక మండలం
పెద్ద ముప్పారం , వాళ్య తండా గ్రామాల పరిసర ప్రాంతాలలో గుడుంబా తయారీ, చేస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో దంతాలపల్లి ఎస్సై రవికుమార్ పోలీస్ సిబ్బందితో గుడుంబా స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు. అనంతరం గుడుంబా తయారీకి ఉపయోగిస్తున్న పానకం , ఇతర సామగ్రిని పరిశీలించి, అక్కడ ఉన్న పానకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్. ఐ మాట్లాడుతూ గ్రామాలలో ప్రభుత్వ నిషేధిత ,గుడుంబా
అక్రమంగా తయారు చేసి నిల్వ ఉంచిన గుడుంబాను తయారు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అనంతరం గుడుంబా తయారీకి ఉపయోగిస్తున్న డ్రమ్ములు, బిందెలు మరియు ఇతర సామగ్రిని కూడా పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టడం జరిగిందనీ
పెద్ద ముప్పారం వాళ్య తండా పరిసర ప్రాంతాలలో అక్రమ గుడుంబా తయారీ మరియు విక్రయాలను అరికట్టేందుకు నిరంతరం తనిఖీలు  నిర్వహిస్తూ, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ ఎస్ఐ తెలిపారు.