prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 11:08 am Digital Edition : PRAJA VANI

గుగ్గిళ్లలో ప్రమాదకరంగా వాటర్ ట్యాంక్‌.. ప్రజల్లో ఆందోళన

గుగ్గిళ్లలో ప్రమాదకరంగా వాటర్ ట్యాంక్‌.. ప్రజల్లో ఆందోళన

బెజ్జంకి,అక్టోబర్ 21(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో వాటర్ ట్యాంక్‌ పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ట్యాంక్‌ పై భాగంలోని పెచ్చులుఊడిపడుతుండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిథిలావస్థకు చేరిన ట్యాంక్‌ నుంచి మంచినీటి సరఫరా కొనసాగడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశంఉందని,సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వాటర్ ట్యాంక్‌ పరిస్థితిని పరిశీలించాలని గ్రామస్థులుకోరుతున్నారు.ట్యాంక్‌కు అవసరమైన మరమ్మతులు చేపట్టి, ప్రజలకు శుభ్రమైన, సురక్షితమైన మంచినీటిని సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రజాప్రతినిధులు,అధికారులు చొరవ తీసుకుని సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు.