prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 5:07 pm Digital Edition : MAHESH MEDCHAL

గుండ్లపోచంపల్లి 299 డివిజన్ ఎస్సి సెల్ ప్రెసిడెంట్ గా కుండ భానుచందర్

*గుండ్లపోచంపల్లి 299 డివిజన్ ఎస్సి సెల్ ప్రెసిడెంట్ గా కుండ భానుచందర్*

*రెండోసారి ఎస్సీ సెల్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక చేసినందుకు కృతజ్ఞతలు*

మేడ్చల్ ప్రజావాణి:- గుండ్లపోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్‌గా రెండవసారి ఎన్నికైన సందర్భంగా కుండ భానుచందర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను నమ్మి మరోసారి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి రెండవసారి ఎస్సీ సెల్ ప్రెసిడెంట్‌గా అవకాశం కల్పించిన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి, హరివర్ధన్ రెడ్డికి, నక్క ప్రభాకర్ గౌడ్ కి, మేడ్చల్ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ కావలి చెన్నయ్య, టీపీసీసీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ మురళీ అన్న, మేడ్చల్ ఏ బ్లాక్ మాజీ అధ్యక్షులు పానుగంటి మహేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనకు ఈ బాధ్యతను అప్పగించిన నాయకుల నమ్మకాన్ని తప్పకుండ నిలబెట్టుకుంటూ, గుండ్లపోచంపల్లి 299 డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, అలాగే ఎస్సీ సెల్ అభివృద్ధికి కృషి చేస్తానని కుండా భానుచందర్ అన్నారు, 29 డివిజన్లో ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కూడ పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు మరియు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు కుండ భానుచందర్ తెలిపారు. భవిష్యత్తులో కూడా నా పైన అందరి సహకారం, ఆశీస్సులు ఉండాలని కుండ భానుచందర్ కోరారు.