prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 10:59 am Digital Edition : PRAJA VANI

గుండ్లగడ్డ కిష్టబావి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో, గుంజ పూజ

*గుండ్లగడ్డ కిష్టబావి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో, గుంజ పూజ*

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 07(ప్రజావాణి):జనగామ పట్టణంలోని గుండ్లగడ్డ కిష్టబావి లో గల శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం నందు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం గణపతి పూజ, గుంజ (కర్ర) పూజ కార్యక్రమం అమ్మవారి ఆశీస్సులతో ఘనంగా జరిగింది.

గురువులు, పెద్దలు, మాన్యులు శ్రీ కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గుదిని యత్రి అంబకేష్, కోయల్ కార్ శేషు విరాట్ జీ, ఆకుల నరేష్, సిరిమల్లె అనిల్, చెల్లోజు నవీన్ చారి, కొత్తపల్లి సత్తయ్య, గోగికార్ రేణుక బాయి, గుదినీయ వైష్ణవి, కోయల్ కార్ లలితాదేవి, సమన్యు, చిదాన్వి శ్రీ, సోమాన్షు, స్నిగ్ధశ్రీ తో పాటు భక్తులు, వార్డు ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.