prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 4:44 pm Digital Edition : PRAJA VANI

గీత కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఉండాలి

*గీత కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఉండాలి: ముదిగొండలో ఎక్సైజ్ అధికారుల ప్రత్యక్ష పరిశీలన*

ముదిగొండ అక్టోబర్ 12 ప్రజావాణి ప్రతినిధి

ముదిగొండ గ్రామంలోని యువ గీత కార్మికులందరికీ గౌడ సంఘం (గీత కార్మిక) గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని గౌడ సంఘం పెద్దల విజ్ఞప్తిపై ఎక్సైజ్ శాఖ అధికారులు తక్షణమే స్పందించారు. ఈ మేరకు సోమవారం కొండపల్లి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్సై వెంకన్న చందు ఆధ్వర్యంలో అధికారులు ముదిగొండ గ్రామాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా గుర్తింపు కార్డులు లేని యువ కార్మికులతో అధికారులు సమక్షంలో తాటి చెట్లు ఎక్కించి వారి నైపుణ్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం వారి వివరాలను నమోదు చేసుకున్నారు.
*ప్రభుత్వ సహాయం అందుతుంది:*
ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై వెంకన్న చందు మాట్లాడుతూ, తాటి చెట్లు గీసే ప్రతి ఒక్కరికీ ఈ గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి పడి ఏదైనా జరిగితే, ఈ కార్డు ఉండటం వల్ల ప్రభుత్వం నుండి లభించే ప్రమాద బీమా, ఎక్స్‌గ్రేషియా మరియు ఇతర సంక్షేమ పథకాలు సులభంగా అందుతాయని అవగాహన కల్పించారు. అర్హులైన వారందరికీ త్వరలోనే కార్డులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పెద్ద గౌడ్ మల్లారపు వేలాద్రి, మల్లారపు శ్రీనివాస్, యూత్ లీడర్ మల్లారపు ఉపేందర్, బుర్ర శ్రీనివాస్, బూరుగు శీను, బుర్ర ధర్మయ్య, బుర్ర వీరబాబు, నాయిని వెంకటేశ్వర్లు, మల్లారపు వెంకటేశ్వర్లు, మల్లారపు రోశయ్య, గంధసిరి గోపయ్య, బుర్ర సాయి, ఎక్సైజ్ కానిస్టేబుళ్లు మరియు గౌడ కులస్థులు తదితరులు పాల్గొన్నారు.