గిర్మాపూర్‌లో ఘనంగా ‘అంగన్ మిలన్’ కార్యక్రమం

మేడ్చల్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా మేడ్చల్ డివిజన్ పరిధిలోని గిర్మాపూర్ అంగన్‌వాడీ కేంద్రాలు–1, 2లో మేడ్చల్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో ‘అంగన్ మిలన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, వారి తల్లులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందుతున్న పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, ప్రాథమిక విద్య తదితర సేవలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అంగన్‌వాడీ సేవల ప్రాధాన్యతను వివరించారు....