మేడ్చల్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా మేడ్చల్ డివిజన్ పరిధిలోని గిర్మాపూర్ అంగన్‌వాడీ కేంద్రాలు–1, 2లో మేడ్చల్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో ‘అంగన్ మిలన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, వారి తల్లులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందుతున్న పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, ప్రాథమిక విద్య తదితర సేవలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అంగన్‌వాడీ సేవల ప్రాధాన్యతను వివరించారు.
చిన్నారుల ఆరోగ్యం, పోషణ, సంరక్షణ కోసం సేవలందిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు కళావతి, వనజ, ఆశా వర్కర్ బాలమణిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ డివిజన్ బీజేపీ అధ్యక్షురాలు జల్లి శైలజా హరినాథ్, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు కొండం ఆంజనేయులు ముదిరాజ్, బీజేపీ జిల్లా కోశాధికారి లవంగ శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి జాకట ప్రేమ్ దాస్, జిల్లా బీజేవైఎం మాజీ కార్యదర్శి రాఘవ రెడ్డి, మేడ్చల్ డివిజన్ కార్యదర్శులు బండి విష్ణు గౌడ్, బొక్క సురేందర్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా నాయకులు బొక్క శ్రీనివాస్ రెడ్డి, మహిళా నాయకురాలు అనిత, బీజేపీ నాయకులు హనుమంత్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, వంశీ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, గౌలికర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.