గిరిజన హక్కుల పోరాటానికి చిరునామా కొమురం భీమ్

గిరిజన హక్కుల పోరాటానికి చిరునామా కొమురం భీమ్! జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన మొలుగు ఆనంద్ రావు కూకట్‌పల్లి, అక్టోబర్ 22 (ప్రజావాణి): తెలంగాణ గిరిజన విప్లవ యోధుడు, ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీమ్ జయంతి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు మొలుగు ఆనంద్ రావు ఘన నివాళులర్పించారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం కొమురం భీమ్ సాగించిన వీరోచిత పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. 1901 అక్టోబర్ 22న జన్మించిన కొమురం భీమ్, నిజాం నిరంకుశ...