prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 7:00 pm Digital Edition : PRAJA VANI

గాగిల్లాపూర్ లో ఘనంగా ఫ్రైడే డ్రైడే

గాగిల్లాపూర్ లో ఘనంగా ఫ్రైడే డ్రైడే

మద్దూరు అక్టోబర్6, ప్రజా వాణి,

మద్దూరు మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన కనక చంద్రం ఆధ్వర్యంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమలో భాగంగా మంగళవారం మంగళవారం డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు.1వ, 2వ వార్డులలో పర్యటించి ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మురికినీరు నిలువ లేకుండా చూసుకోవాలని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ కనకచంద్రం సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రజియా, అంగన్వాడీ టీచర్స్ గుడిసే అరుణ,దాసరి చంద్రకళ, కారోబార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.