గాగిల్లాపూర్ కెనాల్ సమీపంలో రోడ్డు ప్రమాదం – ఆటోను వెనుకనుండి కొట్టిన కారు

  బెజ్జంకి, అక్టోబర్ 18 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ కెనాల్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిద్దిపేట నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆటోను వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా స్థానికులు  అంబులెన్స్ కి సమాచారం ఇవ్వగా సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.