గాగిల్లాపూర్‌లో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన

గాగిల్లాపూర్‌లో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన గ్రామ భద్రతకు సీసీ కెమెరాలు కీలకం- ఎస్సై తోట తిరుపతి బెజ్జంకి, అక్టోబర్ 28 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామంలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యంగా సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమంనిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై తోట తిరుపతి మాట్లాడుతూ గ్రామాల్లో దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. నేరాలు జరిగినప్పుడు నిందితులను సులభంగా గుర్తించేందుకు...