గాగిల్లాపూర్‌లో ఘనంగా 15వ విడత సామాజిక తనిఖీ గ్రామసభ
ఉపాధి పనులు, కూలీల వేతనాలు,నిధుల ఖర్చులపై సమీక్ష
బెజ్జంకి, అక్టోబర్ 11 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామ పంచాయితీకార్యాలయంలో వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) పథకానికి సంబంధించి 15వ విడత సామాజిక తనిఖీ గ్రామసభను గురువారం సర్పంచ్ ఎర్రల జానకిరాజు అధ్యక్షతన నిర్వహించారు.
2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు చేపట్టిన పనులు,కూలీలకు కల్పించిన ఉపాధి దినాలు, నిధుల ఖర్చుల వివరాలను గ్రామసభలో సమీక్షించారు. పనులకు సంబంధించిన మస్టర్లు,బిల్లులు,జాబ్‌కార్డులను పరిశీలించి పారదర్శకతకుప్రాధాన్యతనిచ్చారు.సామాజిక తనిఖీ ఎస్‌ఆర్‌పీ స్వామి, డీఆర్‌పీ డేవిడ్ గ్రామంలో చేపట్టిన పనులు,వేతనాల చెల్లింపులు,మెటీరియల్ ఖర్చులు,పనుల నాణ్యతపై గ్రామస్తులకు వివరించారు. గ్రామస్తుల సందేహాలను నివృత్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతలపల్లి పద్మ, వార్డు సభ్యులు బండిపెల్లి రమేష్, చింతలపల్లి లత, కొండల్ రెడ్డి, కల్లేపల్లి లక్ష్మీ, శ్రీనివాస్, సొల్లు బాలయ్య, న్యాలం శారద,పంచాయతీ కార్యదర్శి పాము రాజేంద్రప్రసాద్,మాజీ సర్పంచ్ అన్నాడి ఆదిరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్, క్లస్టర్ అసిస్టెంట్లు కొమిరె మంజుల, కల్లేపల్లి రమాదేవి, ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.