గాగిల్లాపూర్‌లో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం

బెజ్జంకి,అక్టోబర్ 5 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఎర్రల జానకిరాజు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు గర్భిణీలు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలని, రక్త పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందని, గ్రామంలో...