prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 1:49 pm Digital Edition : PRAJA VANI

గాగిల్లాపూర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

గాగిల్లాపూర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

గ్రామసభలో అభివృద్ధి పనులపై చర్చ.. గ్రామ అభివృద్ధి ప్రణాళిక తయారీ

బెజ్జంకి,అక్టోబర్ 2 (ప్రజావాణి)

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని బెజ్జంకి మండల కేంద్రంలోని గాగిల్లాపూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామ సర్పంచ్ ఎర్రల జానకిరాజు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించారు.కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన VB-G RAM-G (వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్) కార్యక్రమంలో భాగంగా గ్రామంలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై గ్రామ ప్రజలకు వివరించారు. ప్రజల అవసరాలు, గ్రామ ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకొని గ్రామ అభివృద్ధి ప్రణాళికను రూపొందించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతలపల్లి పద్మ, వార్డు సభ్యులు బండిపెల్లి రమేష్, తడకపల్లి పవన్, కల్లేపల్లి లక్ష్మీశ్రీనివాస్, సొల్లు బాలయ్య, న్యాలం శారద శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పులి శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గర్రెపల్లి అంజయ్య, పైడిపల్లి శంకర్, గ్రామ శాఖ అధ్యక్షుడు బొమ్మరవేణి సంతోష్, వీఓ అధ్యక్షురాలు ముత్యం శోభ, సీఏ కొమిరె మంజుల, కల్లేపల్లి రమాదేవి, అంగన్వాడీ టీచర్ శారద, ఆశా వర్కర్ పులి తృతీయవర్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ బుర్ర రాములు తదితరులు పాల్గొన్నారు.