గాంధీ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం.. 50 మంది స్వచ్ఛంద రక్తదానం
గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు దేవరయాంజాల్‌లో వరుసగా 15వ సంవత్సరం రక్తదాన శిబిరం శామీర్‌పేట్, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని శామీర్‌పేట్ డివిజన్ పరిధిలోని దేవరయాంజాల్‌లో కీసర సర్కిల్ తరఫున, వికాస్ మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, యువకులు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దేవరయాంజాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లైఫ్ సేవ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వరుసగా 15వ సంవత్సరం రక్తదాన శిబిరాన్ని...