గాంధీ జయంతి సందర్భంగా ఘట్కేసర్‌లో రక్తదాన శిబిరం….లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహణ

ఘట్కేసర్, అక్టోబర్ 2 (ప్రజావాణి): మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఘట్కేసర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ.. అహింస, సత్యాగ్రహం, శాంతి మార్గాలను ఆయుధాలుగా చేసుకుని స్వాతంత్య్ర ఉద్యమానికి మహాత్మా గాంధీ నాయకత్వం...