గాంధీ జయంతి రోజున పోరుమామిళ్లలో యథేచ్ఛగా మద్యం విక్రయాలు: నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వైన్ షాపులు, అధికారుల నిమ్మకు నీరెత్తిన వైఖరి!

పోరుమామిళ్ల పట్టణంలో అక్టోబర్2ప్రజావాణి జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పవిత్రంగా పాటించాల్సిన జాతీయ డ్రై డే నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కబడ్డాయి.సత్యం,అహింస,మద్యపాన రహిత సమాజమే ధ్యేయంగా జీవించిన ఆ మహనీయుని పుట్టినరోజున, ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయకుండా కొందరు స్వార్థపరులు యథేచ్ఛగా మద్యం విక్రయాలు సాగించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఈ పర్వదినాన పోరుమామిళ్ల టౌన్‌లో మద్యం ఏరులై పారడం పట్ల ప్రజలు, ముఖ్యంగా మహిళా లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. నిబంధనలు కాగితాలకే పరిమితం.. తెరవెనుక...