గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు ఆచరణీయం
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య
*మన ప్రజావాణి*
మంచిర్యాల అక్టోబర్ 02
జాతిపిత మహాత్మాగాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు ఆచరణీయమని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. శుక్రవారం మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని జిల్లాలోని నస్పూర్‌లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సాధనలో మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారని, సత్యం, అహింస, శాంతి, సత్యాగ్రహం వంటి ఆచరణీయ సిద్ధాంతాలను అనుసరించి స్వతంత్రాన్ని సాధించారని తెలిపారు. మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గం, సత్యనిష్ఠ, నిరాడంబర జీవనం, దేశ సేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనీయమని తెలిపారు. సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావం పెంపొందించడంతో పాటు ప్రజాసేవలో నిజాయితీ, బాధ్యత, పారదర్శకత వంటి విలువలను పాటించాలని, గాంధీజీ కలలు కన్న స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, సమానత్వం కలిగిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని తెలిపారుఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..