prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 6:52 pm Digital Edition : MAHESH MEDCHAL

*గాంధీ ఆశయ సాధన కోసం కృషి చేయాలి*

మేడ్చల్,(ప్రజా వాణి):-
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అలియాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యం కొరకు చేసిన పోరాటాలు గుర్తుచేసుకున్నారు. వారి ఆశయాల సాధన కోసం అందరూ కృషి చేయాలని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో కౌన్సిలర్లు ముద్ధం సుధాకర్ రెడ్డి, గూదె వెంకటేష్, సామల జస్వంత్ రెడ్డి, మున్సిపల్ మేనేజర్ వేణుగోపాల్, మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తుంకి బిక్షపతి, నాయకులు కంఠం కృష్ణ రెడ్డి, కోడూరి దినేష్ తదితరులు పాల్గొన్నారు.