*గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం – మహదేవుని శ్రీనివాస్*
జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 02(ప్రజావాణి):
జాతిపిత మహాత్మా గాంధీజీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ల జయంతి సందర్భంగా శుక్రవారం జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ విగ్రహానికి మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మహదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీజీ సత్యం, అహింస, శాంతి, సోదరభావం అనే మార్గాలను ప్రపంచానికి చూపిన మహనీయుడని అన్నారు. గాంధీజీ చూపిన సత్య, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, సమాజంలో శాంతి, ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబరత, నిజాయితీ, దేశభక్తి, కర్తవ్యనిష్ఠకు ప్రతీకగా నిలిచారని అన్నారు. దేశ సైనికులు మరియు రైతుల ప్రాధాన్యతను చాటి చెప్పిన “జై జవాన్ – జై కిసాన్” నినాదం దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపిందని తెలిపారు.
మహాత్మా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి గార్ల ఆశయాలను నేటి తరానికి అందించాలని, వారు చూపిన మార్గంలో సమాజం మరియు దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో లింగంపల్లి శ్రీనివాస్, గొల్లపల్లి శ్రీనివాస్, బొచ్చు ఎల్లయ్య, మంజా బాలరాజు, బొంగు అంజిరెడ్డి, లింగంపల్లి కనకరాజు, స్వాములపల్లి రమేష్, ఏర్పుల రాజు, పొతుగంటి రవి, ఉప్పల వంశీ, ఏనిశెట్టి కిరణ్, గీస లింగం, ముత్యం కర్ణాకర్, జనగామ శ్రీకాంత్, దొడ్ల విష్ణుమూర్తి, పబ్బోజు రాములు చారి, కానుగుల బాబు, లింగంపల్లి మహేష్, కొండ వెంకటేష్, గుండా మహేష్, మేడికుంట శ్రీనివాస్, ఎక్కలదేవి శ్రీనివాస్, పొతుగంటి యాదగిరి, జనగాం సంతోష్, దువ్వల శ్రీనివాస్, పుట్ట శ్రీనివాస్, పబ్బోజు శ్రీనివాస్, గొల్లపల్లి దశరథం, సిలివేరి మల్లేశం, లింగంపల్లి బాల్ నర్సయ్య, సానాది మల్లేశం, బుడుగే బిక్షపతి మరియు చింతల రమేష్ తదితరులు పాల్గొన్నారు.