గాంధీజీ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం: నాయకుల పిలుపు
మేడ్చల్ (ప్రజా వాణి):- సైబరాబాద్ పరిధిలోని 299వ డివిజన్ కండ్లకోయలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను మాజీ సర్పంచ్ కందాడి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత మార్గాలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమని అన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు సురేందర్...