prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 1:09 pm Digital Edition : MAHESH MEDCHAL

గాంధీజీ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం: నాయకుల పిలుపు

మేడ్చల్ (ప్రజా వాణి):- సైబరాబాద్ పరిధిలోని 299వ డివిజన్ కండ్లకోయలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను మాజీ సర్పంచ్ కందాడి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత మార్గాలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమని అన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు సురేందర్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు రవి ముదిరాజ్, బండారి నరేందర్ ముదిరాజ్, భాస్కర్ ముదిరాజ్, యూత్ అధ్యక్షులు నవీన్ ముదిరాజ్ పాల్గొన్నారు. కండ్లకోయ సీనియర్ నాయకులు, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తలారి పెంటేష్, పి. వీరాస్వామి, తలారి బిక్షపతి ముదిరాజ్, ఎస్. రాజేందర్ ముదిరాజ్, తలారి నాగులు ముదిరాజ్, మత్స్యకార సంఘం అధ్యక్షులు చిల్ల వెంకటేష్ ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్ ముదిరాజ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, కండ్లకోయ మత్స్యకార సంఘం అధ్యక్షులు కె. శ్రీకాంత్ ముదిరాజ్, తలారి బాబు, ప్రవీణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ప్రజలు, నాయకులు, యువత, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పించారు